Chiranjeevi: ఆ దర్శకుడి దగ్గర పనిచేయడం నా అదృష్టం..

దిగ్గజ దర్శకుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వనాథ్ నేడు (ఫిబ్రవరి 19) 92వ ఏటలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న‌కు తెలుగు అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 19 Feb 2022 14:21 IST

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ 92వ పుట్టిన రోజు సందర్భంగా చిరు ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్: దిగ్గజ దర్శకుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వనాథ్ నేడు 92వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న‌కు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘గురు తుల్యులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి.. తెలుగు సినిమా చ‌రిత్ర.. శంక‌రాభ‌ర‌ణం ముందు, శంక‌రాభ‌ర‌ణం త‌ర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారంద‌రికీ అందిన వ‌రం. మీ చిత్రాలు అజ‌రామ‌రం. మీ దర్శకత్వంలో న‌టించ‌డం నా అదృష్టం. మీరు క‌ల‌కాలం ఆయురారోగ్యాల‌తో సంతోషంగా ఉండాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

విశ్వనాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి మూడు సినిమాల్లో నటించారు. చిరు కెరీర్ ప్రారంభంలో ‘శుభ‌లేఖ’ను తెరకెక్కించారు. ఆపై మాస్ హీరోగా  గుర్తింపు పొందాక.. ‘స్వయంకృషి’ చేశారు. ఇందులో చెప్పులు కుట్టే సాంబయ్యగా కనిపించారు. ఆపాత్రను అంత సహజంగా మలిచిన తీరు విశ్వనాథ్‌కే సొంతం. ఆ త‌ర్వాత ‘ఆప‌ద్బాంధ‌వుడు’లో మాధవ అనే పాత్రలో నటించారు. విశ్వనాథ్‌కు మరికొంత మంది సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని