Chiranjeevi: ట్విటర్‌ ఖాతా పేరు మార్చుకున్న చిరు.. కారణమేమిటంటే..!

కరోనా వైరస్‌ కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోల్పోయిన నెటిజన్లలో ఉత్సాహం నింపేందుకు, పలు అంశాలపై వారికి అవగాహన కల్పించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి 2020లో ట్విటర్‌లోకి అడుగుపెట్టారు.....

Updated : 17 Apr 2022 11:08 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి 2020లో ట్విటర్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన పేరుతో ఓ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించి.. ఆ వేదికగా తన తదుపరి సినిమా అప్‌డేట్స్‌, నటినటులతో సరదా సంభాషణలు నిర్వహించారు. కాగా, తాజాగా చిరు తన ట్విటర్‌ ఖాతా పేరు మార్చుకున్నారు. ‘‘చిరంజీవి’’కి బదులు ‘‘ఆచార్య’’గా ఖాతా పేరు మార్చారు. చిరు చేసిన ఈ పనితో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన తదుపరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చిరు ఇలా చేశారని చెప్పుకొంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆచార్య’. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిలో జరిగే అవినీతి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈసినిమాలో ఆచార్యగా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. రామ్‌చరణ్‌.. సిద్ధగా కీలకపాత్ర పోషించారు. కాజల్‌, పూజాహెగ్డే కథానాయికలు. కొరటాల శివ తెరకెక్కించిన ఈసినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ టీమ్‌ ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇందులో భాగంగానే చిరంజీవి తన ట్విటర్‌ ఖాతా పేరు మార్చుకున్నారు. ఇక, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లకు తన పేరునే కొనసాగిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని