God Father: చిరు-సల్మాన్‌ ‘గాడ్‌ఫాదర్‌’ హిందీ ట్రైలర్‌ చూశారా..?

చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ హిందీ ట్రైలర్‌ విడుదలైంది.

Published : 01 Oct 2022 16:43 IST

ముంబయి: చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ముంబయిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి కథానాయకుడు చిరంజీవితో పాటు, సల్మాన్‌, సత్యదేవ్‌, మోహన్‌రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ తెరకెక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని