
Chiranjeevi: మహేశ్.. నిన్ను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా: చిరంజీవి
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం సెలబ్రిటీలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మహేశ్ కోసం ట్వీట్ చేశారు. ‘‘గెట్ వెల్ సూన్ మహేశ్‌బాబు. నువ్వు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. వెండితెరపై నీ యాక్షన్ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని చిరు ట్వీట్ చేశారు. మరోవైపు #GETWellSoonSSMB అంటూ సాయితేజ్, సత్యదేవ్, తారక్‌తోపాటు పలువురు తారలు తాజాగా ట్వీట్లు పెట్టారు.
తమన్‌కు కరోనా
సినీ పరిశ్రమపై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్, యువ సెలబ్రిటీలు దాని బారిన పడగా తాజాగా సంగీత దర్శకుడు తమన్‌కు (Thaman) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తదుపరి సినిమా పనుల్లో భాగంగా ఇటీవల మహేశ్‌ని తమన్ కలిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం మహేశ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తమన్ సైతం పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.