Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా ఆమెతో దిగిన ఫొటోలను పంచుకున్నారు.
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఆమెతో దిగిన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేశారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఉన్న ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్(Ramcharan), ఆయన భార్య ఉపాసన ఉన్న వీటిని చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘‘ఈరోజు మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. అభిమానులు కూడా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.250కోట్లు వసూళ్లు చేసింది. తాజాగా ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన చిరంజీవి ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ‘నాటు నాటు’ పాట ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక కావడం దేశానికే గర్వకారణమని అన్నారు. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్(Pawan Kalyan) నటించనున్న OG(#OG) సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వీటి కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Dharmapuri Srinivas: అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!