Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
నటుడు తారకరత్న(Taraka Ratna) ఆరోగ్యంపై చిరంజీవి(Chiranjeevi) ట్వీట్ చేశారు. ఏ ప్రమాదం లేదు అనే మాట తనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందన్నారు.
హైదరాబాద్: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
‘‘సోదరుడు తారకరత్న(Taraka Ratna) త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుంచి అతడిని కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను డియర్ తారకరత్న’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల తీవ్రమైన గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra)లో పాల్గొనడానికి కుప్పం వెళ్లిన ఆయన.. పాదయాత్ర చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ముందుగా కుప్పం ఆసుపత్రిలో చికిత్స అందించి.. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!