Bangarraju: ‘మేఘాల్లో బంగార్రాజు’.. నాగార్జున, నాగ చైతన్య వినూత్న ప్రచారం
తమ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఒక్కో చిత్ర బృందం ఒక్కోలా ప్రచారం చేస్తుంటుంది. ఈ విషయంలో ‘బంగార్రాజు’ టీమ్ వినూత్న ప్రయత్నం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఒక్కో చిత్ర బృందం ఒక్కోలా ప్రచారం చేస్తుంటుంది. ఈ విషయంలో ‘బంగార్రాజు’ టీమ్ వినూత్న ప్రయత్నం చేసింది. ఓ ప్రత్యేక విమానంలో సినిమా విశేషాల్ని పంచుకుంది. ‘మేఘాల్లో బంగార్రాజు’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమిది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగార్జున, నాగ చైతన్య, కృతిశెట్టి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ విశేషాలివీ..
* ‘బంగార్రాజు’ సినిమాలో నటించటం ఎలా అనిపించింది?
నాగార్జున: గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన పాత్రల్ని నా కెరీర్ ప్రారంభంలో పోషించా. మధ్యలో అలాంటి బ్యాక్‌డ్రాప్ చిత్రాలు తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయన’ చేశా. ఆ సినిమాలో నటించేటపుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. దాని సీక్వెల్ ‘బంగార్రాజు’లో మరోసారి మళ్లీ అలాంటి రోల్ పోషించటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ పాత్ర కోసం నేర్చుకున్న యాస, పంచెకట్టు గొప్ప అనుభూతి పంచాయి. ఇలాంటివి నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు) సినిమా ‘దసరా బుల్లోడు’లో ఎక్కువగా కనిపించేవి.
* నాగచైతన్య.. ఈ సినిమా కోసం మీరెలా సన్నద్ధమయ్యారు?
నాగ చైతన్య: నా కెరీర్లో నేను ఇప్పటి వరకూ ఇలాంటి పాత్రల్లో నటించలేదు. చిన్న బంగార్రాజు పాత్ర బాగా నచ్చటంతో ఈ చిత్రంలో నటించా. ఓ వైపు చిన్న బంగార్రాజుగా, మరోవైపు పెద్ద బంగార్రాజుగా నటించటం కొత్తగా అనిపించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందు తొలి భాగాన్ని (సోగ్గాడే చిన్నినాయన) ఐదారు సార్లు చూశా. అందులోని యాస, మ్యానరిజం గమనించేవాడ్ని. ఈ సినిమా విషయాకొనిస్తే.. కీలక సన్నివేశాల్లో నేను బాగా మాట్లాడేందుకు నాన్న (నాగార్జున) సంబంధిత డైలాగ్స్‌ని రికార్డ్ చేసి ఇచ్చేవారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కూడా యాస విషయంలో సహాయం చేశారు. వీరిద్దరి ఇన్‌పుట్స్‌తో నా పాత్ర చాలా బాగా వచ్చింది.
* కృతిశెట్టి.. ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
కృతిశెట్టి: నేనిందులో సర్పంచి నాగలక్ష్మి అనే పాత్ర పోషించా. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే పాత్ర కావడంతో కాస్త కష్టమనిపించింది. కానీ, టీమ్ సహకారంతో కొన్ని రోజులకు తేలికగా అనిపించింది. ప్రతిరోజూ షూటింగ్ ప్రారంభానికి ముందు సంభాషణలు ఎలా చెప్పాలో, హావభావాలు ఎలా పలకాలో దర్శకుడిని అడిగి తెలుసుకునేదాన్ని.
* పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు.. ఎవరితో కంఫర్ట్ అనిపించింది?
కృతిశెట్టి: ఇద్దరూ కంఫర్ట్‌గానే ఉంటారు. అయితే, పెద్ద బంగార్రాజు (నాగార్జున)తో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు.
* నాగార్జున, నాగ చైతన్య చిత్రాల్లో మీకేది బాగా ఇష్టం?
కృతిశెట్టి: నాగార్జునగారు నటించిన సినిమాల్లో నాకు ‘మనం’ బాగా ఇష్టం. నాగ చైతన్య చిత్రాల్లో ‘మజిలీ’.
* పంచెకట్టు విషయంలో తాతగారిని ఫాలో అయ్యారా? నాన్నను అనుసరించారా?
నాగ చైతన్య: ఈ విషయంలో నాన్ననే ఫాలో అయ్యా. సినిమాలో బంగార్రాజు మనవడిని కాబట్టి ఆయన్నే అనుసరించా.
* నాగార్జునతో కలిసి ‘మనం’ సినిమాలోనూ నటించారు. అప్పటికీ ఇప్పటికీ మీరు చూసిన మార్పేంటి?
నాగ చైతన్య: ‘మనం’, ‘బంగార్రాజు’.. రెండూ వేర్వేరు నేపథ్యాల్లో తెరకెక్కాయి. అందులోని పాత్రల తీరూ విభిన్నంగా ఉంటుంది. రెండు సినిమాల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ‘మనం’ చిత్రీకరణ సమయంలో నాన్నతో కలిసి నటించేందుకు కాస్త భయపడేవాడ్ని. ఇప్పుడు ఆ భయం పోయింది.
* ఈ సినిమా సంగీతం గురించి..
నాగ చైతన్య: ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రతి పాటా విడుదలైన అనతి కాలంలోనే వైరల్ అయింది. ఈ చిత్రానికే కాదు అనూప్ ప్రతి సినిమాకూ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు.
* పెద్ద బంగార్రాజుకి చిన్న బంగార్రాజు ఏమవుతాడు?
నాగార్జున: ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా చూసిన వారందరికీ సమాధానం తెలిసి ఉండొచ్చు. అందులో బంగార్రాజుకి రాము కొడుకు కాబట్టి ఇందులో చిన్న బంగార్రాజు మనవడు.
* అన్నాతమ్ముళ్లుగా నటించే అవకాశం వస్తే చేస్తారా?
నాగార్జున: తప్పకుండా చేస్తాం. అన్నాతమ్ముళ్ల పాత్రలు మా ఇద్దరికీ (నాగార్జున, నాగచైతన్య) సవాలు విసిరేలా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్