Published : 30 Aug 2021 16:34 IST

Cinema news: బాలకృష్ణులుగా జూనియర్‌ సర్జా.. మంచు అవ్రామ్‌లను చూశారా?

హైదరాబాద్‌: సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు సినీ తారలు కృష్ణ పరమాత్మ ఫొటోలను, సందేశాలను పంచుకున్నారు. మరికొందరు తమ చిన్ననాటి ఫొటోలను, ఇప్పుడు తమ చిన్నారులను కృష్ణుడి గెటప్‌లో రెడీ చేసిన ఫొటోలను షేర్‌ చేశారు. దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా తనయుడిని చిన్ని కృష్ణుడిగా తీర్చిదిద్దిన ఫొటోలను ఆయన సతీమణి మేఘనారాజ్‌ పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు మేఘనా రాజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మేఘన ఐదు నెలల గర్భంతో ఉన్న సమయంలో నటుడు చిరంజీవి సర్జా గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

మంచు అవ్రామ్‌ సందడి

కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు-వెరోనికా దంపతుల ముద్దుల తనయుడు అవ్రామ్‌ భక్త కూడా చిన్ని కృష్ణుడి గెటప్‌లో అలరించారు. ‘నా చిన్నారి కృష్ణ మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నాడు’ అంటూ మంచు విష్ణు అవ్రామ్‌ ఫొటోలను పంచుకున్నారు. ఇక అగ్రకథానాయిక కాజల్‌ కూడా కృష్ణాష్టమికి స్పెషల్‌గా రెడీ అయినా రాధాకృష్ణుల ప్రతిమలకు నమస్కరిస్తున్న ఫొటోను షేర్‌ చేసింది.




Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని