KGF Chapter 2: ‘కేజీయఫ్‌’.. మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది!

ప్రేక్షకులకు ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ నుంచి మరో సర్‌ప్రైజ్‌ అందింది. ఇందులోని మెలొడీ విడుదలై అలరిస్తోంది.

Published : 14 Apr 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ గురువారం బాక్సాఫీసు ముందుకొచ్చి హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘మెహబాబా’ అంటూ సాగే పాటను ప్రేక్షకులకు కానుకగా అందించింది. నాయకానాయికల ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ గీతం అన్ని వర్గాల శ్రోతలను అలరించేలా ఉంది. ఈ పాట తెలుగు వెర్షన్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా అనన్య భట్‌ ఆలపించారు. రవి బస్రూర్‌ స్వరాలు సమకూర్చారు.

‘కేజీయఫ్‌ 2’ను యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. గతంలో ఇదే కాంబినేషన్‌లో ఘన విజయం అందుకున్న ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’కు కొనసాగింపుగా వచ్చింది. యశ్ నటనకు, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని