Mehreen: పెళ్లి గురించి ఇప్పుడు చ‌ర్చించ‌డం లేదు

యువ నాయిక మెహ్రీన్ కౌర్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న సంగతి తెలిసిందే. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం కుదిరింది. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న వీరు ఈ ఏడాదిలోనే ఒక్క‌ట‌వ్వాల‌నుకున్నారు. కానీ ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ‘అస‌లు మేము పెళ్లి గురించి చ‌ర్చించ‌డం లేదు’ అని తెలిపింది మెహ్రీన్‌.

Published : 26 May 2021 23:33 IST

ఇంట‌ర్నెట్ డెస్క్: యువ నాయిక మెహ్రీన్ కౌర్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న సంగతి తెలిసిందే. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం కుదిరింది. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న వీరు ఈ ఏడాదిలోనే ఒక్క‌ట‌వ్వాల‌నుకున్నారు. కానీ ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ‘అస‌లు మేము పెళ్లి గురించి చ‌ర్చించ‌డం లేదు’ అని తెలిపింది మెహ్రీన్‌. ఇటీవల క‌రోనా బారిన ప‌డిన‌ ఈ భామ కొవిడ్ సెకండ్ వేవ్‌, పెళ్లి త‌దితర విష‌యాల గురించి మాట్లాడింది. ‘కొవిడ్ మ‌రికొంత కాలం ఉంటుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. దీన్నివ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దగ్గరివారిని పోగొట్టుకోవ‌డం చాలా విచార‌క‌రం. గ‌తేడాది మా నాన్నకి కొవిడ్ సోకింది. కొన్ని వారాల క్రితం అమ్మ‌కీ నాకూ కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇద్ద‌రం ఇంట్లోనే ఉన్నాం. మొద‌ట్లో కొన్ని రోజులు ఇబ్బంది అనిపించింది. పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో చివరకు దాన్ని జ‌యించాం. ఈ క్లిష్ట స‌మ‌యంలో అమ్మ‌, భవ్య బిష్ణోయ్ నాకు తోడుగా నిలిచారు. కొవిడ్ నుంచి కోలుకున్నా.. త‌ర్వాత కాస్త‌ నీర‌సంగా ఉంటోంది. ఇటీవ‌ల చిన్న చిన్న వ్యాయామాలు చేయ‌డం ప్రారంభించాను. నా పెంపుడు కుక్క బెర్లిన్‌తో క‌లిసి వాకింగ్ చేస్తున్నాను. పెళ్లి విష‌యానికొస్తే.. అసలు దాని గురించి ప్ర‌స్తుతం మేము చ‌ర్చించుకోవ‌డం లేదు. చూద్దాం! ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డాలి క‌దా!’’ అని తెలిపింది.

వెంక‌టేశ్, వ‌రుణ్తేజ్ క‌థానాయ‌కులుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘ఎఫ్ 3’లో న‌టిస్తోంది మెహ్రీన్‌. ఇప్ప‌టికే కొంత‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. గ‌తంలో ఇదే కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘ఎఫ్ 2’ కి సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని