నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్‌

తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు నిజమేనని నటి మెహరీన్‌ తెలిపారు. త్వరలోనే తాను వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నానన్నారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ....

Published : 14 Feb 2021 16:26 IST

నేనెంతో సంతోషంగా ఉన్నా

హైదరాబాద్‌: తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు నిజమేనని నటి మెహరీన్‌ తెలిపారు. త్వరలోనే తాను వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నానన్నారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లిపై మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.

తాజాగా ఆ వార్తలపై నటి స్పందించారు. తన పెళ్లి వార్తలు నిజమేనని.. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనుందని.. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వివరించారు. ఈ మేరకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని జైపుర్‌ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. మరోవైపు ‘ఎఫ్‌2’కు కొనసాగింపుగా అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్‌3’లో ఆమె నటిస్తోంది.

ఇదీ చదవండి

సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని