ఘనంగా మెహరీన్‌ నిశ్చితార్థం

తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మెహరీన్‌. తాజాగా

Updated : 12 Mar 2021 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మెహరీన్‌. తాజాగా ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ఓ కోట వీరి నిశ్చితార్థ వేడుకకు వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది మెహరీన్‌. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందని సమాచారం.

మెహరీన్‌కు కాబోయే వరుడు భవ్య బిష్ణోయ్ హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌కి మనవడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో తన ప్రేమ విషయాన్ని మెహరీన్‌ తెలియజేసింది. నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో మెహరీన్‌ తెలుగుతెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’ తదితర సూపర్‌హిట్‌ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’లో హనీగా సందడి చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని