Mehreen: ముఖం నిండా సూదులతో మెహ్రీన్.. ఎందుకంటే..!
నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రీన్ తాజా ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్: ‘హని ఈజ్ ది బెస్ట్..’ అంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రీన్. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో అలరించలేకపోయినా ‘ఎఫ్2’తో మళ్లీ ఫాంలోకి వచ్చింది ఈ అందాలతార. తాజాగా మెహ్రీన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ముఖం నిండా సూదులతో ఉన్న ఫొటోని మెహ్రీన్ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఏమైందంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆక్యుపంక్చర్(Acupuncture) ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమస్పందన తెలియజేస్తున్నారు. ‘మీరు సహజంగానే అందంగా ఉంటారు’ అని ఒకరంటే.. ‘ఇలాంటి వాటితో జాగ్రత్త’ అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: ఒకే నెలలో రూ.12 వేల కోట్లకు పైగా అప్పు