Mehreen: ముఖం నిండా సూదులతో మెహ్రీన్.. ఎందుకంటే..!

నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ మెహ్రీన్‌ తాజా ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Updated : 02 Dec 2022 15:42 IST

హైదరాబాద్‌: ‘హని ఈజ్‌ ది బెస్ట్..’ అంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ మెహ్రీన్‌. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో అలరించలేకపోయినా ‘ఎఫ్‌2’తో మళ్లీ ఫాంలోకి వచ్చింది ఈ అందాలతార. తాజాగా మెహ్రీన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ముఖం నిండా సూదులతో ఉన్న ఫొటోని మెహ్రీన్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఏమైందంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆక్యుపంక్చర్(Acupuncture) ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమస్పందన తెలియజేస్తున్నారు. ‘మీరు సహజంగానే అందంగా ఉంటారు’ అని ఒకరంటే.. ‘ఇలాంటి వాటితో జాగ్రత్త’ అని మరొకరు కామెంట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు