Cinemanews: మేం విడిపోతున్నాం: మెహరీన్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ఆమెకు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. గత మార్చిలో నిశ్చితార్థం కూడా జైపూర్‌ వేదికగా ఘనంగా జరిగింది.

Updated : 03 Jul 2021 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ పిర్జాదా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. గత మార్చిలో నిశ్చితార్థం కూడా జైపూర్‌ వేదికగా ఘనంగా జరిగింది. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్‌ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్‌, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్‌ స్పష్టం చేసింది. తన వ్యక్తిగత గోప్యతను అందరూ గౌరవిస్తారని.. ఇక నుంచి తన అభిమానులను అలరించేందుకు సినిమాలు చేస్తానని ఆమె పేర్కొంది.

నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో మెహరీన్‌ తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’ తదితర హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’లో మరోసారి హనీగా సందడి చేయనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని