Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌ తొమ్మిదేళ్ల ఆకలికి సమాధానం..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నుంచి బ్లాక్‌బస్టర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ వస్తే చూడాలని ఎదురుచూస్తోన్న అభిమానులకు సమాధానం చెబుతూ వచ్చిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌....

Published : 25 Feb 2022 15:30 IST

‘భీమ్లానాయక్‌’పై మీమ్స్‌ జాతర మొదలాయె

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్‌ నుంచి బ్లాక్‌బస్టర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ వస్తే చూడాలని ఎదురుచూస్తోన్న అభిమానులకు సమాధానం చెబుతూ వచ్చిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకోంది. మలయాళీ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ తెలుగు నెటివిటీకి సెట్‌ అయ్యేలా ‘భీమ్లానాయక్‌’ కథలో కాస్త మార్పులు చేశారు. పవర్‌ఫుల్‌ పోలీస్ పాత్రలో పవన్‌కల్యాణ్‌, ఆయనతో పోరాటం చేసే వ్యక్తిగా రానా.. ఇద్దరూ నటనలో ఎక్కడా తగ్గలేదు. ఇక, ప్రతి పాత్రకూ న్యాయం చేసేలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అందించిన డైలాగ్స్‌ అయితే అభిమానులతో థియేటర్లలో ఈలలు వేస్తున్నాయి. వీటన్నింటికీ తోడు తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించే అందరూ మాట్లాడుతున్నారు. కొన్ని షాట్స్‌కి ఆయన అందించిన స్కోర్‌.. మాస్‌ జాతరలా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌, తమన్‌లను మెచ్చుకుంటూ ‘భీమ్లానాయక్‌’పై వరుస మీమ్స్‌ నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..!













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని