Dolo 650: జలుబు+జ్వరం+దగ్గు+తలనొప్పి అన్నింటికీ డోలో 650

ఓవైపు కరోనా, మరోవైపు సీజనల్‌ వ్యాధులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కరోనాలో ప్రధాన చెప్పుకునే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి...

Published : 23 Jan 2022 01:48 IST

నెట్టింట్లో వరుస కట్టిన సరదా మీమ్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓవైపు కరోనా, మరోవైపు సీజనల్‌ వ్యాధులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. దీంతో తమకు వచ్చింది సాధారణ జలుబు, దగ్గునా? లేదా కరోనానా? అన్న సందిగ్ధతలో కొంతమంది ప్రజలు భయానికి లోనవుతున్నారు. మరి కొంతమంది మాత్రం డోలో 650 మాత్రల్ని ఆశ్రయిస్తున్నారు. ఏ కాస్త జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు అనిపించినా వెంటనే ‘డోలో 650’ని తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు భారతదేశంలో ఏ ఒక్కరి నోట విన్నా ఒకే ఒక్క పేరు ‘డోలో’నే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, డోలో మాత్రలపై పలువురు నెటిజన్లు సరదా మీమ్స్‌ క్రియేట్‌ చేసి నెట్టింట్లో షేర్‌ చేయగా.. వాటిని చూసి సెలబ్రిటీలు సైతం నవ్వుకుంటున్నారు. నెటిజన్లను ఆకర్షిస్తోన్న సరదా మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..! అయితే, జలుబు, దగ్గు, జ్వరం సమస్య ఏదైనా వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా మందులు తీసుకోవటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని