Tamanna: తమన్నా ఎందుకు అందర్నీ చంపుతుంది...?

‘మాస్ట్రో’తో ప్రతినాయకురాలి పాత్రలో మెప్పించి.. మరో సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి తమన్నా. నితిన్‌ కథానాయకుడిగా నటించిన...

Published : 18 Sep 2021 21:54 IST

మిల్కీబ్యూటీ నటనకు చిన్నారి కన్నీళ్లు

హైదరాబాద్: ‘మాస్ట్రో’తో ప్రతినాయకురాలి పాత్రలో మెప్పించి.. మరో సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి తమన్నా. నితిన్‌ కథానాయకుడిగా నటించిన ఈసినిమా ఇటీవల డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. కాగా, ఇందులో తమన్నా క్యారెక్టర్‌ని చూసి ఓ చిన్నారి కన్నీరు పెట్టుకుంది. ‘తమన్నా బ్రెయిన్‌ మార్చేశారు. ఆమె ఎందుకు అందర్నీ చంపుతుంది?’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది. దీనికి సంబంధించిన వీడియో షేర్‌ చేసిన నితిన్‌.. ‘ఏంటి తమన్నా ఇది.. నువ్వు నీ అభిమానుల్ని ఏడిపిస్తున్నావ్‌. నేను చూసిన వాటిల్లో ఈ వీడియో ఎంతో క్యూట్‌గా ఉంది. మన దర్శకుడు మేర్లపాక గాంధీ చిన్నకుమార్తె లిపి.. నీకు వీరాభిమాని’ అని నితిన్‌ ట్వీట్‌ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో  వైరల్‌గా మారింది.

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ‘అంధాధున్‌’ రీమేక్‌గా ‘మాస్ట్రో’ తెరకెక్కింది. ఒరిజినల్‌లో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను నితిన్‌ పోషించగా.. టబు, రాధికా ఆప్టే పాత్రల్లో తమన్నా, నభానటేశ్‌ సందడి చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా నెగటివ్‌ రోల్‌ పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని