Meter: ‘మీటర్‌’.. మొదలవ్వడమే వంద స్పీడ్‌లో

ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ప్రేక్షకుల్ని అలరించారు కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడు ‘మీటర్‌’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు.

Updated : 05 Apr 2023 07:00 IST

ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ప్రేక్షకుల్ని అలరించారు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడు ‘మీటర్‌’ (Meter) తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రమేష్‌ కడూరి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతుల్య రవి కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో ఇప్పటి వరకు ప్రయోగాత్మక చిత్రాలే చేశాం. కానీ, రెగ్యులర్‌ కమర్షియల్‌ జానర్‌లో ఓ సినిమా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం. దీనికి తగ్గట్లుగానే దర్శకుడు రమేష్‌ బలమైన కథ తీసుకొచ్చారు. నిజానికి ఇది పెద్ద హీరోతో చేసే సబ్జెక్ట్‌. మేమూ అలాగే చేయాలనుకున్నాం. కానీ, కుదర్లేదు. ఈలోపు కిరణ్‌ అబ్బవరం ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ రిలీజ్‌ అయ్యి హిట్టయ్యింది. అప్పుడే తనకు కథ చెప్తే చేస్తానన్నాడు. ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్‌కు తగ్గట్లుగానే సినిమా మొదలవ్వడమే వంద స్పీడ్‌లో ఉంటుంది. ఇందులో కిరణ్‌ పోలీస్‌ పాత్రలో కనిపిస్తారు. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిదే. ఇందులో తన స్టైల్‌, ఎనర్జీ, మ్యానరిజమ్‌ అందరినీ ఆకట్టుకుంటాయి. సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని