Michael: మైఖేల్ ఆరంభం మాత్రమే!
‘‘కష్టం, ప్రతిభ, అదృష్టం... ఈ మూడూ కలిసొస్తే ఉన్నతమైన స్థానంలోకి వెళతారు. సందీప్‌లో కష్టం, ప్రతిభ కనిపిస్తూనే ఉంది. ‘మైఖేల్’ (Michael) నుంచి తనకి అదృష్టం కూడా తోడవుతుందని నా నమ్మకం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాని (Nani).
సందీప్‌కిషన్
‘‘కష్టం, ప్రతిభ, అదృష్టం... ఈ మూడూ కలిసొస్తే ఉన్నతమైన స్థానంలోకి వెళతారు. సందీప్‌లో కష్టం, ప్రతిభ కనిపిస్తూనే ఉంది. ‘మైఖేల్’ (Michael) నుంచి తనకి అదృష్టం కూడా తోడవుతుందని నా నమ్మకం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాని (Nani). హైదరాబాద్‌లో జరిగిన ‘మైఖేల్’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. సందీప్‌కిషన్ (sundeep kishan), దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన చిత్రమిది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మేనన్ ముఖ్యపాత్రలు పోషించారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. చిత్రం ఈనెల 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘చాలా ఏళ్ల తర్వాత ఓ సినిమా కొత్తగా కనిపిస్తోంది. ‘శివ’ వచ్చినప్పుడు మిగతా సినిమాల మధ్య ఎంతో కొత్తగా అనిపించింది. అలాంటి సినిమా ‘మైఖేల్’ కావాలని కోరుకుంటున్నా. సందీప్‌కిషన్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా. దివ్యాంశ కౌశిక్ చాలా అందంగా కనిపించింది. వరుణ్ సందేశ్‌కి సరైన పాత్ర పడింది’’ అన్నారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘‘‘మైఖేల్’ నాకు ప్రత్యేకం. నాని ఈ వేడుకకి రావడం మరింత ప్రత్యేకంగా మారింది. ఈ సినిమా కోసం నా శక్తియుక్తులన్నీ ఒడ్డి కష్టపడ్డా. నాకు దర్శకుడు రంజిత్ ఓ పెద్ద బహుమానం నేను ఏదైతే చేయలేనని అనుకున్నారో, అవన్నీ ఇందులో చేసి చూపించా. మా గురువు గౌతమ్ మేనన్ ఇందులో నటించడం సంతోషం. ఈ సినిమా కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఇది నా ఆరంభం మాత్రమే. ప్రేక్షకుల ప్రేమ ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా పనిచేస్తా’’ అన్నారు. ‘‘సందీప్‌కిషన్‌ని ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళుతుందని నమ్ముతున్నా. నా కెరీర్‌లో ఇప్పటిదాకా చేయని ఓ విభిన్నమైన పాత్రని చేశా. కొత్తగా కనిపించబోతున్నా’’ అన్నారు వరుణ్ సందేశ్. ‘‘పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కథ విశ్వజనీనమైనది. రంజిత్ కథని బాగా చెప్పడమే కాదు.. సినిమాని అంత బాగా తీశారు. 1,500పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, ఛోటా కె.నాయుడు, నందినిరెడ్డి, సాయిరాజేష్, వి.ఐ.ఆనంద్, కల్యాణ్ చక్రవర్తి, కిరణ్ కౌశిక్, గాంధీ నడికుడికర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)