Michael: మైఖేల్‌.. చాలా ప్రత్యేకం

సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’ (Michael). భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మించారు.

Updated : 29 Jan 2023 13:12 IST

సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’ (Michael). భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మించారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో చాలా మంది అద్భుతమైన నటీనటులున్నారు. మేమందరం కథని, దర్శకు బలంగా నమ్మాం. మా నమ్మకాన్ని ట్రైలర్‌కు వచ్చిన స్పందన నిలబెట్టింది. ఇది చాలా ఒరిజినల్‌ చిత్రం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ముఖ్యంగా దర్శకుడు రంజిత్‌ శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డాడు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’’ అంది నాయిక దివ్యాంశ. నటుడు వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో సందీప్‌ మరోస్థాయికి వెళ్తాడని నమ్మకంగా ఉన్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రంజిత్‌, భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని