Michael: సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ టీజర్‌ వచ్చేసింది.. దేవుడవ్వాలనే ఆశ లేదు మాస్టర్‌!

‘నేను మనిషిగానే ఉంటాను మాస్టర్‌. దేవుడవ్వాలనే ఆశ లేదు’ అని అంటున్నారు సందీప్‌ కిషన్‌. ఆయన హీరోగా నటిస్తున్న ‘మైఖేల్‌’ టీజర్‌ విడుదలైంది.

Updated : 07 Dec 2022 21:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘మైఖేల్‌’ (Machael). దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ప్రారంభించింది చిత్ర బృందం. ఈ క్రమంలో తెలుగు టీజర్‌ను నటుడు నాని (Nani) విడుదల చేయగా ఇతర భాషల్లో మరికొందరు తారలు రిలీజ్‌ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘మైఖేల్‌.. వేటాడటంరాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్‌’ అనే సంభాషణతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆ డైలాగ్‌కు దీటుగా సందీప్‌ ఇచ్చిన సమాధానం వావ్‌ అనిపించేలా ఉంది. సందీప్‌ లుక్‌, నటన చాలా కొత్తగా ఉన్నాయి. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ యాక్షన్‌ థ్రిలర్‌ టీజర్‌ను చూసేయండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని