Rana Miheeka: ఆ వార్తలపై రానా సతీమణి క్లారిటీ

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి 2020లో సింగిల్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ చెప్పిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌తో ఆయన ఏడడుగులు బంధంలోకి అడుగుపెట్టారు. ....

Published : 02 Apr 2022 14:23 IST

నెటిజన్‌కు రిప్లై ఇచ్చిన మిహీక

హైదరాబాద్‌: సినిమా షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే రానా దగ్గుబాటి.. ఇటీవల తన సతీమణి మిహీకతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. బజాజ్‌ కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకల్లో వీరు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మిహీక ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఆ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు.. ‘క్యూట్‌ కపుల్‌’, ‘లవ్లీ పెయిర్‌’ అని కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండగా మిహీక షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె కొంచెం బొద్దుగా ఉన్నట్లు గుర్తించిన నెటిజన్లు.. మిహీక ప్రెగ్నెంట్‌ అని, రానా త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నారంటూ కామెంట్లు పెట్టారు. ఓ నెటిజన్‌ ఆమెను.. మీరు ప్రెగ్నెంటా?’’ అని ప్రశ్నించగా.. ‘‘అలా ఏం కాదు. వివాహం తర్వాత బరువు పెరగడం సాధారణమే కదా’’ అని రిప్లై ఇచ్చారు. మిహీక ఇచ్చిన సమాధానంతో ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్‌ పడినట్లు అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని