Milind Soman: స్ఫూర్తినింపేలా యోగా వీడియో.. సతీమణిపై మిలింద్‌ సోమన్‌ కామెంట్‌!

బాలీవుడ్‌ నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ కుటుంబమంతా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సంబంధిత వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ఎందరిలోనో స్ఫూర్తినింపుతుంటుంది.

Published : 29 Jun 2022 02:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ (Milind Soman) కుటుంబమంతా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సంబంధిత వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, అనేకమందిలో స్ఫూర్తినింపుతుంటుంది. ఈ విషయంలో 56 ఏళ్ల మిలింద్‌తో 83 ఏళ్ల తన మాతృమూర్తి ఉషా సోమన్‌ పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. వీరితోపాటు, ఇప్పటికే తన యోగా సెషన్‌కు సంబంధించి పలు విశేషాలు పంచుకున్న మిలింద్‌ భార్య అంకితా కొన్వర్‌ (Ankitha Konwar) ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. యోగా చేయడం ఎలాగో నేర్పిస్తూ, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరించడం ఆమె ప్రత్యేకత. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె షేర్‌ చేసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ‘‘యోగా మనకు క్రమశిక్షణతోపాటు ఎన్నో ఉపయోగకర విషయాలు నేర్పుతుంది. మనం ఆరోగ్యాన్ని కొనలేం. ఓవర్‌ నైట్‌లో మనం ఆరోగ్యవంతులం కాలేం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉండగలం’’ అని అంకిత పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన మిలింద్‌ తన సతీమణిని ప్రశంసించారు. ‘నువ్వు ఓ అద్భుతం’ అని కామెంట్‌ పెట్టారు. పలువురు సినీ ప్రముఖులూ అంకితను కొనియాడారు.

ఆరేళ్ల వయసులోనే స్విమ్మింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించిన మిలింద్‌ సంబంధిత పోటీల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. మిలింద్‌ మోడల్‌, నటుడే కాదు నిర్మాత కూడా. ‘16 డిసెంబరు’, ‘అగ్ని వర్ష’, ‘సే సలాం ఇండియా’ ,‘ది ఫ్లాగ్‌’, ‘షాడో’ తదితర హిందీ చిత్రాల్లో నటించిన ఆయన ‘సత్యమేవ జయతే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని