Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. జూన్‌లో ఇది విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్: పవన్‌కల్యాణ్ (Pawan kalyan) సినిమాలో విలన్‌గా నటించాలని దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) తనని కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) అన్నారు. తనని గంటన్నరసేపు బతిమిలాడినా.. తాను చేయనని చెప్పానన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్ ఫేమస్’ టీజర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మద్యపానం, ధూమపానం, షికార్లు, అమ్మాయిల వెంట పడటం.. ఇలాంటివి చేస్తే ఫేమస్ కారు. కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. పాలమ్మిన.. పూలమ్మిన.. కాలేజీలు పెట్టిన.. టాప్ డాక్టర్లను, సైంటిస్టులను తయారు చేశాను.. అదీ ఫేమస్. కాబట్టి యువత కష్టపడి పనిచేసి అన్నింటా విజయాన్ని అందుకోవాలి. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగ పరచుకోవాలి. దానికి ఎంతో కష్టపడాలి. ఏ ఒక్కరూ షార్ట్‌కట్‌లో సక్సెస్ కాలేరు. 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు పెళ్లి అయ్యింది. అప్పుడు నా వద్ద ఏమీ లేదు. పాలు అమ్ముకునేవాడిని. కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యాను. కాబట్టి ఇప్పటికైనా షికార్లు బంద్ చేసి జీవితంలో ముందుకెళ్లడంపై దృష్టి పెట్టాలి. ఈ సినిమా టీజర్ నాకెంతో నచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ అయ్యాక ఈ హీరోతో నేనొక సినిమా చేస్తా. అలాగే, ఎన్నికలు అయిపోయాక తెలంగాణ యాసలో పలు చిత్రాలు నిర్మిస్తా. హరీశ్ శంకర్ మా ఇంటికి వచ్చాడు. గంటన్నర బతిమిలాడాడు. పవన్‌కల్యాణ్ సినిమాలో విలన్‌గా చేయమన్నాడు. చేయనని చెప్పా’’ అని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cricket News: అత్యాచార ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడిన శ్రీలంక క్రికెటర్
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్