Mission Impossible: మీ అందరినీ కాపాడటానికి నా ప్రాణాలు ఇస్తా: టామ్‌ క్రూజ్‌

Mission Impossible: యాక్షన్‌ ప్రియులను అలరించేలా ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ కొత్త చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది.

Published : 18 May 2023 12:37 IST

హైదరాబాద్‌: ‘తనకు ఏదైనా జరిగితే, నిన్ను ఊరికే వదిలి పెట్టను.. వెతుక్కుంటూ వచ్చి చంపుతాను’ అంటున్నారు టామ్‌ క్రూజ్‌. ఆయన కథానాయకుడిగా క్రిస్టోఫర్‌, మెక్‌ క్యూరీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: డెడ్‌ రెకనింగ్‌’ (Mission Impossible Dead Reckoning). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా పార్ట్‌-1 జులై 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌తో పాటు, తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ సిరీస్‌లో టామ్‌ క్రూజ్‌ చేసిన సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటికి ఏ మాత్రం తీనిపోని విధంగా ఇందులోనూ యాక్షన్‌ ప్రియులను అలరించేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా టామ్‌ క్రూజ్‌ బైక్‌తో సహా కొండపై నుంచి దూకే సీన్‌ హైలైట్‌గా ఉంది. మరి ఈసారి ఈథన్‌ హంట్‌(టామ్‌ క్రూజ్‌) ఎంచుకున్న మిషన్‌ ఏంటి? దాన్ని పూర్తి చేసే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన స్నేహితుల ప్రాణాలు కాపాడటానికి ఈథన్‌ హంట్‌ ఏం చేశాడు?తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అప్పటి వరకూ ఈ యాక్షన్‌ ట్రైలర్‌ చూసి ఆస్వాదించండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు