Mission Majnu: పాకిస్థాన్‌ న్యూక్లియర్‌ స్థావరాన్ని ఎలా కనిపెట్టారు?

Mission Majnu: సిద్ధార్థ్‌ మల్హోత్ర, రష్మిక నటించిన స్పై థ్రిల్లర్‌ ‘మిషన్‌ మజ్ను’ట్రైలర్‌ విడుదలైంది.

Published : 09 Jan 2023 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ అక్రమంగా ఓ న్యూక్లియర్‌ బాంబును తయారు చేస్తోంది. కానీ, అది ఎక్కడ తయారు చేస్తోందో ఎవరికీ తెలియదు. దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. ఎలాంటి విషయాన్నైనా తన చాకచక్యంతో బయటకు తీసుకురాగల భారత స్పై ఏజెంట్‌ మజ్ను (సిద్ధార్థ్‌ మల్హోత్ర) (Sidharth Malhotra)ను రంగంలోకి దింపింది భారత్‌. ఆ న్యూక్లియర్‌ బాంబును కనిపెట్టడానికి మజ్ను చేపట్టిన మిషన్‌ ఏంటి? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏవి? నస్రీన్‌ (రష్మిక) ఎవరు? చివరకు పాకిస్థాన్‌ తయారు చేస్తున్న న్యూక్లియర్‌ బాంబు స్థావరాన్ని మజ్ను కనిపెట్టాడా? తెలియాలంటే ‘మిషన్‌ మజ్ను’  (Mission Majnu) చూడాల్సిందే. శంతను భాగ్చి దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్‌ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. జనవరి 20నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని