MM Keeravani: ‘నాటు నాటు’.. గుర్తింపు ఆలస్యమైందా?: కీరవాణి సమాధానమేంటంటే

కొత్త సినిమా ప్రచారంలో భాగంగా సంగీత దర్శకుడు కీరవాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ‘ఆస్కార్‌’ సాంగ్‌ ‘నాటు నాటు’ ప్రస్తావనరాగా స్పందించారు.

Published : 11 Jul 2024 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటతో ‘ఆస్కార్‌’ పురస్కారం అందుకుని టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించారు సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (MM Keeravani). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ఈ పాట ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరి’లో అకాడమీ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాను సంగీతం అందించిన కొత్త సినిమా ‘ఔరో మే కహా దమ్‌ థా’ త్వరలో విడుదల కానున్న సందర్భంగా కీరవాణి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆస్కార్‌’ ప్రస్తావన తీసుకొస్తూ.. ‘కాస్త ఆలస్యంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని అనుకున్నారా?’ అని యాంకర్‌ ప్రశ్నించగా కీరవాణి స్పందించారు.

‘‘త్వరగానో, ఆలస్యమో.. నేను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వని సాంగ్‌కు మంచి గుర్తింపు వచ్చింది’’ అని అన్నారు. ‘నాటు నాటు’ పాట కంటే ఇంకా బెస్ట్‌ సాంగ్స్‌ కంపోజ్‌ చేశాననే ఉద్దేశంలో ఆయన అలా పేర్కొన్నారు. గుర్తింపు రావాల్సిన సమయంలో ఎక్కడి నుంచైనా వస్తుందన్నారు. పాట రాసిన చంద్రబోస్‌ సైతం అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్‌ అందుకున్నప్పుడూ తనకు ఎగ్జైట్‌మెంట్‌ లేదని కీరవాణి గతంలో ఓ కార్యక్రమంలో చెప్పడం గమనార్హం.

రివ్యూ: ధూమం.. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన థ్రిల్లర్‌ ఎలా ఉంది?

అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), టబు (Tabu) ప్రధాన పాత్రల్లో దర్శకుడు నీరజ్‌ పాండే తెరకెక్కించిన చిత్రం ‘ఔరో మే కహా దమ్‌ థా’ (Auron Mein Kahan Dum Tha). ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 2న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని