Naatu Naatu Song: ‘నాటు నాటు’ కేవలం ఫాస్ట్ బీట్ మాత్రమే.. అవార్డు వస్తుందనుకోలేదు: కీరవాణి
mm keeravani: ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా అనుకోలేదని, అసలు అవార్డు వస్తుందని కూడా తాను అనుకోలేదని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు, హాలీవుడ్‌ను సైతం ఉర్రూతలూగించిన పాట ‘నాటు నాటు’ (Naatu Naatu). అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ పాటకు ఆస్కార్ సైతం ఫిదా అయింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి (mm keeravani), గేయ రచయిత చంద్రబోస్‌లు అకాడమీ అవార్డును అందుకున్నారు. అవార్డుల వేడుక అనంతరం ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన కీరవాణి ‘నాటు నాటు’ పాట గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సంగీతపరంగా చూస్తే ‘నాటు నాటు’ గొప్ప పాటేమీ కాదని, అయితే, స్పెషల్ కమర్షియల్ సాంగ్ అన్నారు. దర్శకుడు రాజమౌళి మేకింగ్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ వల్లే ఆ పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు.
‘‘నాటు నాటు’ ఒక మాస్ సాంగ్. డ్యాన్స్ వేయాలనిపించే సాంగ్. టెక్నికల్‌గా, కళాత్మకంగా మాట్లాడితే, ప్రతిభను చూపించడానికి వీలుండే, శాస్త్రీయ సంగీతం, గొప్ప కవిత్వం, ఇంకా సంక్లిష్టమైన ఆర్కెస్ట్రేషన్ (మ్యూజిక్ నోట్స్ అధ్యయనం చేయడం)కు ఆస్కార్ అవార్డులు వస్తాయని మీరు ఆశించవచ్చు. అయితే, ‘నాటు నాటు’ బ్రహ్మాండమైన కమర్షియల్ సాంగ్. ఫాస్ట్ బీట్ నంబర్. ఆస్కార్ సంగతి పక్కన పెట్టండి. అసలు అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించని పాట’’ అని కీరవాణి అభిప్రాయపడ్డారు.
ఇక పాటను తెరకెక్కించిన తీరు, డ్యాన్స్ వల్లే ‘నాటు నాటు’ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని కీరవాణి అన్నారు. ‘‘దర్శకుడి మేకింగ్, కొరియోగ్రాఫర్ వల్ల పాటకు ఆకర్షణ వచ్చింది. పాటను తరచి చూస్తే, సినిమా కథకు మిళితమై ఇందులో ఒక చిన్న కథ కూడా ఉంటుంది. ఇక స్పెషల్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్‌ల వల్ల విపరీతంగా వైరల్ అయింది. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళి, ప్రేమ్ రక్షిత్‌లకు దక్కుతుంది. అలాగే చంద్రబోస్‌కు కూడా. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలోనే చెప్పాను. ప్రపంచం మొత్తం కేవలం రెండు లైన్లను గుర్తు పెట్టుకుంది. ‘నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు’ వీటిని సృష్టించిన ఘనత చంద్రబోస్‌కే దక్కుతుంది. తమిళ్, మలయాళం, హిందీల్లో కూడా ఈ పాట చేశాం. కానీ, తెలుగు పాటనే ఆస్కార్‌కు రిజిస్టర్ చేశాం. ఈ విషయంలో చంద్రబోస్ అదృష్టవంతుడు. తెలుగు వెర్షన్ వింటుంటే రిథమిక్‌గా ఉండటమే కాదు మరింత ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇతర భాషా రచయితలు కూడా తమ వంతు కృషి చేశారు. పాట కన్నా కూడా ‘నాటు నాటు’ అందరి నోటా ఒక మంత్రంలా మారిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.
తనని ప్రతిదానికీ ‘ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్’ అనడం నచ్చదని కీరవాణి చెప్పారు. అది తన పనిని తక్కువ చేసినట్లు అవుతుందన్నారు. ‘‘ఆస్కార్ అనేది చాలా పెద్ద పేరు. ప్రజలు దాన్ని ట్యాగ్ చేస్తుంటారు. ‘ఫలానా ఆయన ఆస్కార్ విన్నర్’, ‘ఆస్కార్ విన్నర్ ఎక్స్‌వైజెడ్’ అంటూ పిలుస్తారు. ఒకట్రెండుసార్లు బాగానే ఉంటుంది. ప్రతిసారీ అలా పిలుస్తుంటే ఆ ‘ఎక్స్‌వైజెడ్’కు విలువ ఏం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆర్ఆర్‌ఆర్’ విడుదలై మార్చి 25తో ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు