
Gentleman 2: ‘జెంటిల్మెన్ 2’ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి
హైదరాబాద్: అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బాస్టర్ చిత్రం ‘జెంటిల్మెన్’. 1993లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘జెంటిల్మెన్ 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నారు నిర్మాత కుంజుమన్. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ‘బాహుబలి’ చిత్రాల సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ‘జెంటిల్మెన్2’ చిత్రానికి స్వరాలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కుంజుమన్ వెల్లడించారు.
అర్జున్ నటన, శంకర్ టేకింగ్ మాత్రమే కాదు, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ‘జెంటిల్మెన్’ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. సీక్వెల్‌కు కూడా ఏఆర్ రెహమాన్నే తీసుకుందామని చిత్ర బృందం భావించిందట. అయితే, సాంకేతిక కారణాల వల్ల కీరవాణి ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. ఇక ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న ఆసక్తి కూడా ఇండస్ట్రీలో నెలకొంది. నిర్మాత కుంజుమన్ అనుకున్న విధంగా భారీ బడ్జెట్‌తో ఎవరైతే సినిమా తీయగలరో వారి కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.