Modern Love: 6 కథల సమాహారం.. ఆసక్తిగా ‘మోడర్న్‌ లవ్‌’ టీజర్‌

ప్రముఖ నటులు సుహాసిని రేవతి, నిత్య మేనన్‌, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, మాళవిక నాయర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘మోడర్న్‌ లవ్‌: హైదరాబాద్‌’.

Published : 24 Jun 2022 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ నటులు సుహాసిని (Suhasini Maniratnam), రేవతి (Revathi), నిత్య మేనన్‌ (Nithya Menen), ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), రీతూ వర్మ, మాళవిక నాయర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘మోడర్న్‌ లవ్‌: హైదరాబాద్‌’ (Modern Love: Hyderabad). ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో ప్రచురితమైన కథనాల స్ఫూర్తితో రూపొందిన ఈ సిరీస్‌ జులై 8 నుంచి ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ విడుదలైంది. ‘కొన్ని బంధాలు ఏళ్ల తరబడి నడుస్తాయ్‌. కొన్ని కొంతకాలానికే క్యాన్సిల్‌ అయిపోతాయ్‌’ అనే సంభాషణతో ప్రారంభమైన టీజర్‌ ఆసక్తిగా సాగింది. 6 కథల సమాహారంగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రేమలోని పలు పార్శ్వాలను చూపించనున్నారు. హైదరాబాద్‌ నేపథ్యంలో రూపొందిన ఈ ఆరు ఎపిసోడ్ల క్రేజీ సిరీస్‌కు వెంకటేశ్‌ మహా (కేరాఫ్‌ కంచరపాలెం సినిమా ఫేం), నగేశ్‌ కుకునూర్‌ (గుడ్‌లక్‌ సఖి చిత్ర ఫేం), ఉదయ్‌ గుర్రాల, దేవికా దర్శకత్వం వహించారు. ఇదే కథాంశంతో హిందీలో రూపొందిన ‘మోడర్న్‌ లవ్‌: ముంబయి’ ఇటీవల విడుదలై, మంచి ఆదరణ దక్కించుకుంది. తమిళనాడు నేటివిటీకి తగ్గట్టు రూపొందిన ‘మోడర్న్‌ లవ్‌: చెన్నై’ సిరీస్‌ త్వరలోనే రాబోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని