Mohan Babu: చిరంజీవికి నాకూ మధ్య ఎలాంటి విభేదాల్లేవు: మోహన్‌బాబు
చిరంజీవి (Chiranjeevi)తో తనకున్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు మోహన్‌బాబు (MohanBabu). తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని అన్నారు.
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi)తో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు నటుడు మోహన్‌బాబు (MohanBabu). వీలు కుదిరినప్పుడల్లా మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉంటామని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌బాబుని చిరంజీవితో నెలకొన్న వివాదాలపై స్పందించమని విలేకరి కోరగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై స్పందిస్తూ.. ‘‘సోషల్‌మీడియాలో ఇలాంటివి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతం మేము సంతోషంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విషయం గురించి వద్దు మరేదైనా అడగండి’’ బదులిచ్చారు.
‘‘మా’ (MAA Elections) ఎన్నికల సమయంలో మీ ఇద్దరి మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు అందరూ అనుకున్నారు?’’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఆ బాధ ఇప్పటికీ నా మనసులో ఉంది. అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? నా తప్పా? అనేది ఇప్పుడు చర్చించాలనుకోవడం లేదు. మేమిద్దరం వందసార్లు ఎదురుపడ్డాం. మాట్లాడుకున్నాం. మా మధ్య ఏమీ లేదు. బయటవాళ్లు అనుకోవడం మాత్రమే’’ అని ఆయన వివరించారు. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు (Vishnu).. అద్భుతంగా పనిచేసి చెప్పిన పనులన్నీ పూర్తి చేశాడని.. ఒక్క బిల్డింగ్ మాత్రమే పెండింగ్ ఉందని అన్నారు. విష్ణు నటించిన ‘జిన్నా’ ఫెయిల్యూర్‌పై స్పందిస్తూ.. ‘‘జిన్నా’ ఎందుకు విజయం సాధించలేకపోయిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది మంచి సినిమా. ఓటీటీలో మంచి ఫలితాలు అందుకుంది’’ అని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్‌గౌడ్
-
Sports News
IND vs PAK: మా జట్టుకు బెదిరింపులు వచ్చాయి.. అయినా అప్పుడు మేం వచ్చాం: అఫ్రిది
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
-
India News
Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్టు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Nara Devansh: నారా దేవాన్ష్ పుట్టినరోజు.. తితిదేకు లోకేశ్-బ్రాహ్మణి విరాళం