mohan babu: అపురూప రాజదండం అందుకున్న మోహన్‌బాబు

అపురూప రాజదండం అందుకున్న మోహన్‌బాబు పూర్తి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు.

Published : 11 Jul 2024 17:58 IST

హైదరాబాద్‌: విలక్షణ నటుడిగా 500లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు (Mohan Babu). ముఖ్యంగా డైలాగ్‌ డెలివరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఒక ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. ‘ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజదండం అందడం పూర్వజన్మ సుకృతం.. ఈ రాజ దండం ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అతి త్వరలో వివరాలు తెలియజేస్తా’ అని ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోహన్‌బాబు ప్రస్తుతం నటిస్తూ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘కన్నప్ప’. టైటిల్‌రోల్‌ను మంచు విష్ణు పోషిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు