‘పెద‌రాయుడు’ గుర్తుగా ‘స‌న్ ఆఫ్ ఇండియా’ పాట‌

 మోహ‌న్ బాబు హీరోగా డైమండ్ ర‌త్న‌బాబు తెర‌కెక్కిస్తోన్న చిత్రం  ‘స‌న్ ఆఫ్ ఇండియా’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇళ‌యరాజా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు.

Published : 13 Jun 2021 14:04 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: మోహ‌న్ బాబు హీరోగా డైమండ్ ర‌త్న‌బాబు తెర‌కెక్కిస్తోన్న చిత్రం  ‘స‌న్ ఆఫ్ ఇండియా’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇళ‌యరాజా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. జూన్ 15న తొలి పాట‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు మోహ‌న్ బాబు. త‌న కెరీర్‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘పెదరాయుడు’ చిత్రం విడుదలైన రోజునే త‌న కొత్త చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు.

‘‘1995 జూన్ 15  ‘పెద‌రాయుడు’ రిలీజైన 26 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత 2021 జూన్ 15న  ‘స‌న్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియో రిలీజ్ కానుండటం  శుభ‌సూచకంగా భావిస్తున్నాను. అప్పుడు  ‘పెద‌రాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే.. ఇప్పుడు ఈ  ‘స‌న్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి నిర్మాత నా త‌న‌యుడు విష్ణు వ‌ర్థ‌న్ బాబు కావ‌డం సంతోదాయకం. ‘స‌న్ ఆఫ్ ఇండియా’కు సంబంధించి 11వ శ‌తాబ్ద‌పు ర‌ఘువీర గద్యం.. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత సార‌థ్యంలో రాహుల్ నంబియార్ స్వ‌రంతో లిరిక‌ల్ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాట‌ని మ‌ర్యాద పురుషోత్త‌ముడైన శ్రీరాముడికి అంకితం ఇస్తున్నాను’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని