MohanBabu: మలయాళం కథలో..

ఈ ఏడాది ఆరంభంలో ‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు నటుడు మోహన్‌బాబు. ఇప్పుడు తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమా చేస్తున్నారు. కాగా, ఇప్పుడాయన కోసం ఓ రీమేక్‌ కథ సిద్ధమైంది. అదే ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’.

Updated : 13 Oct 2022 07:08 IST

ఈ ఏడాది ఆరంభంలో ‘సన్నాఫ్‌ ఇండియా’ (Son Of India) చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు నటుడు మోహన్‌బాబు (MohanBabu). ఇప్పుడు తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి ‘అగ్ని నక్షత్రం’ (Agni Nakshatram) అనే సినిమా చేస్తున్నారు. కాగా, ఇప్పుడాయన కోసం ఓ రీమేక్‌ కథ సిద్ధమైంది. అదే ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’ (Android Kunjappan). మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు నటుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌’ తెలుగు రీమేక్‌ను వచ్చే ఏడాది జనవరి నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రధాన పాత్రను నాన్న మోహన్‌బాబు పోషిస్తారు. ఆయన తనయుడి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుణ్ని ఎంపిక చేయనున్నాం. ప్రస్తుతం తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా కథలో మార్పులు చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామ’’ని చెప్పారు విష్ణు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో మిళితమై ఉంటుంది. మాతృకలో సూరజ్‌ తేలక్కడ్, సౌబిన్‌ షాహిర్, సూరజ్‌ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. రతీష్‌ బాలకృష్ణన్‌ పొదువాల్‌ తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని