Monster: రివ్యూ: మాన్‌స్టర్.. మోహన్‌లాల్, మంచు లక్ష్మిల సినిమా ఎలా ఉందంటే?
మోహన్‌లాల్, మంచు లక్ష్మి, హనీరోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాన్‌స్టర్’. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్’లో విడుదలైంది.
చిత్రం: మాన్‌స్టర్; నటీనటులు: మోహన్‌లాల్, హనీరోజ్, మంచు లక్ష్మి, సుదేవ్ నాయర్ తదితరులు; ఎడిటింగ్: షమీర్ మహ్మద్ ; సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్; సంగీతం: దీపక్ దేవ్; నిర్మాత: ఆంటోనీ పెరంబవూర్; రచన: ఉదయ్ కృష్ణ; దర్శకత్వం: వైశాఖ్; స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‌స్టార్.
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohan Lal) హీరోగా, మంచు లక్ష్మి, హనీరోజ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘మాన్‌స్టర్’ (Monster). థియేటర్ల వేదికగా ఇటీవల మలయాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. మరి, మంచు లక్ష్మి నటించిన తొలి మలయాళ సినిమా అయిన ‘మాన్‌స్టర్’ విశేషాలు చూద్దామా..
కథేంటంటే?: అనిల్ చంద్ర (సుదేవ్ నాయర్), భామిని (హనీరోజ్) దంపతులు. తమ కూతురే వారి లోకం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన చంద్ర ఓ ప్రమాదంలో గాయపడతాడు. కొన్ని కారణాల వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఆర్థిక సమస్యల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు భామిని ‘షీ- ట్యాక్సీ’ డ్రైవర్‌గా మారుతుంది. విధి నిర్వహణలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి లక్కీసింగ్ (మోహన్‌లాల్) అనే వ్యక్తిని పికప్ చేసుకుని, అతను చెప్పిన లొకేషన్‌కు తీసుకెళ్తుంది. ఆ ప్రయాణంలో.. భామినికి ఇంకా పెళ్లికాలేదనుకుని ఆమెతో చనువుగా ఉంటాడు లక్కీసింగ్. తనకు ఓ పాప కూడా ఉందని భామిని చెప్పడంతో షాక్ అయిన లక్కీసింగ్ అక్కడితో ఆపడు.. ఆమె ఇంటికీ వెళతాడు. అదే రోజు చంద్ర హత్యకు గురవతాడు. వారి కూతురు కిడ్నాప్ అవుతుంది. ఎప్పుడూ ఏ హాని తలపెట్టని చంద్రను ఎవరు చంపారు? సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన లక్కీ సింగ్ ఆ కేసును చేధించే క్రమంలో తెలుసుకున్న నిజాలేంటి? (Monster Review) అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.
ఎలా ఉందంటే?: థ్రిల్లర్ అనగానే నేరాలు, పోలీసు అధికారుల పరిశోధనలుంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అవడం సహజం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మాట్ ఒకటే అయినా కథా, కథనాలను కొత్తగా ప్రయత్నిస్తుంటారు దర్శక-రచయితలు. ఈ సినిమా విషయాకొస్తే.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తోన్న ‘హోమోసెక్సువల్’ కాన్సెప్ట్‌ను ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఓ రాష్ట్ర హైకోర్టు స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకొన్న ఇద్దరు మహిళలు సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? వారి మానసిక పరిస్థితి ఏంటి? అన్న కోణంలో ఈ కథను రాశారు ఉదయ్ కృష్ణ. ఊహించలేని స్క్రీన్‌ప్లేతో దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు వైశాఖ్ విజయం సాధించారు. అయితే, అసలు కథ చెప్పేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. భామిని (హనీరోజ్) కుటుంబ పరిచయం, మోహన్‌లాల్ (లక్కీసింగ్) ఆమెను ఇష్టపడటం.. ఇలా సాధారణ సన్నివేశాలతోనే (Monster Review) ప్రథమార్ధం సాగుతుంది.
ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తిస్తుంది. సెకండాఫ్ ఊహించలేని మలుపులతో వేగంగా దూసుకెళ్తుంది. లక్కీసింగ్ చేసిన దర్యాప్తు మెప్పిస్తుంది. కానీ, ఓ డ్రాబ్యాక్ ఏంటంటే వాటిని ఉత్సుకత కలిగేలా చూపించకుండా ఓ పాఠంలా వివరించడం. క్రైమ్ థ్రిల్లర్‌లకు ట్విస్ట్‌లు ఎంత ముఖ్యమో వాటిని పక్కాగా వివరిస్తూ ఉత్కంఠ పెంచడం అంత ముఖ్యం. ఈ విషయంలో (Monster Review) దర్శకుడు కసరత్తు చేయాల్సిందనిపిస్తుంది. తమ పెళ్లిరోజే పలువురు పురుషులు హత్యకు గురవడం, చంద్ర విషయంలోనూ అదే జరగడం, ఈ మర్డర్‌లన్నింటినీ ఒకరే చేశారని లక్కీ సింగ్ తెలుసుకోవడం.. ఆయా సన్నివేశాలను మరింత ఎలివేషన్‌తో చూపిస్తే బాగుండేది. స్వలింగ జంట ఎవరో తెలుసుకున్న ప్రేక్షకుడు థ్రిల్ ఫీలైనా క్లైమాక్స్ విషయంలో సంతృప్తి చెందకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే?: లక్కీసింగ్ గెటప్‌లో పంజాబీ వ్యక్తిగా నవ్వులు పంచుతూ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లుక్‌లో హుందాగా కనిపించారు మోహన్‌లాల్. భామిని పాత్రకు హనీసింగ్ ప్రాణం పోసింది. ఈ క్యారెక్టర్‌కే ఎక్కువ నిడివి ఉంది. దుర్గ అనే ఆయా పాత్రలో కొత్త మంచు లక్ష్మిని చూడొచ్చు. ఆమె లుక్స్, నటన చాలా విభిన్నంగా ఉన్నాయి. పాజిటివ్, నెగెటివ్ రోల్స్‌లో తనదైన మార్క్ చూపించారు. జగపతిబాబు అతిథిగా కనిపిస్తారు. దీపక్ దేవ్ నేపథ్యం సన్నివేశాలకు మంచి బలాన్ని చేకూర్చింది. థీమ్‌కు తగ్గట్టు లొకేషన్లను క్యాప్చర్ చేయడంలో సతీష్ కురుప్ ఓకే అనిపిస్తారు. షమీర్ ఫస్ట్ హాఫ్ విషయంలో తన ‘కత్తెర’కు ఇంకా పని చెప్పాల్సింది. వైశాఖ్ డైరెక్షన్ బాగుంది.
బలాలు: + కథ; + ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు; + హనీరోజ్, మోహన్‌లాల్, మంచు లక్ష్మిల నటన
బలహీనతలు: - ప్రథమార్ధం; - దర్యాప్తు సీన్లను ఆసక్తిగా చూపించకపోవడం
చివరిగా: ఈ ‘మాన్‌స్టర్’ ఇన్వెస్టిగేషన్ సూపర్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Director Sagar: ‘స్టూవర్టుపురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్‌పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!