Mohan lal: మోహన్‌లాల్‌ ‘12th మ్యాన్‌’ ఓటీటీలో రానుందా?

మోహన్‌లాల్‌(Mohan lal) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘12th మ్యాన్‌’.

Updated : 22 Feb 2022 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌లాల్‌(Mohan lal) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘12th మ్యాన్‌’. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ  క్రమంలో ఓ వార్త సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ‘12th మ్యాన్‌’ను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ నుంది. మార్చిలో ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ‘12th మ్యాన్‌’ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. ‘దృశ్యం’, ‘దృశ్యం2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని