ఆ ఇద్దరు హీరోలే ట్రోల్స్‌ చేయిస్తున్నారు: మోహన్‌బాబు

సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌పై నటుడు మోహన్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ ఇద్దరు హీరోలే ఈ ట్రోలింగ్స్‌ చేయిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రమోషన్స్‌తో...

Updated : 17 Feb 2022 17:07 IST

హైదరాబాద్‌: సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌పై నటుడు మోహన్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ ఇద్దరు హీరోలే ఈ ట్రోలింగ్స్‌ చేయిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. దర్శకుడు రత్నబాబు కథ చెప్పిన వెంటనే తనకు బాగా నచ్చేసిందని అన్నారు. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఓ మంచి కథ అని.. సినిమా చూసిన ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని తెలిపారు.

‘‘ఓసారి రత్నబాబు నన్ను కలిసి ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ కథ చెప్పారు. కుల వ్యవస్థ, రాజకీయం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో కీలక అంశాలను ఈ సినిమాలో చూపించాం. ఒక రాజకీయ నాయకుడి కారణంగా ఓ అమాయకుడైన వ్యక్తి ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్యాయంగా ఎలా జైలుకి వెళ్లాడు?.. ఇలాంటి ఎన్నో అంశాలపై ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. భారతదేశంలో ఎంతోమంది చేయని తప్పులకు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం. ప్రైవేటు జైలు అనే కొత్త కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో చూపించాం’’ అని తెలిపారు.

అనంతరం సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై స్పందిస్తూ.. ‘‘సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ని తెలిసిన వాళ్లు అప్పుడప్పుడూ నాకు పంపిస్తుంటారు. ఒక్కొసారి వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుంటుంది. ట్రోల్స్‌ అంటే.. నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదు. ఓ ఇద్దరు హీరోలు.. కొంతమందిని అపాయింట్‌ చేసుకుని ఇలాంటి ట్రోల్స్‌ క్రియేట్‌ చేయిస్తున్నారు. ఆ హీరోలు ఎవరో నాకు బాగా తెలుసు. ట్రోల్స్‌ చేయించేవాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ, ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు’’ అని మోహన్‌బాబు వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని