Mohanlal AamirKhan: ఆమిర్‌- మోహన్‌లాల్‌ ఫొటో వైరల్‌.. అందుకే కలిశారా?

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ కలిసి దిగిన ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 28 Mar 2022 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ కలిసి దిగిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కళ్లజోడు, గళ్ల చొక్కాతో ఆమిర్‌.. టోపీ, నీలి రంగు టీ షర్టుతో మోహన్‌లాల్‌ స్టైలిష్‌గా కనిపించి, అభిమానులతో ‘వావ్‌’ అనిపించేలా ఉన్నారు. ఈ ఫొటోపై ఇప్పటికే కొందరు నెటిజన్లు స్పందించారు. ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్‌’, ‘పిక్చర్ అదిరింది’ అంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు తెరకెక్కే అవకాశాలున్నాయని, అందుకే కలిశారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నిజమా, కాదా? అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ఆగస్టు 11న విడుదలకానుంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. కరీనా కపూర్ కథానాయిక. షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు ‘12th మ్యాన్‌’, ‘ఎలోన్‌’ తదితర చిత్రాలతో మోహన్‌లాల్‌ బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని