Mohanlal: లక్కీ సింగ్‌ వస్తున్నాడు

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మాన్‌స్టర్‌’. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 21న సినిమాని విడుదల చేస్తున్నట్లు కొత్తపోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంటూ వెల్లడించారు మోహన్‌లాల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.

Updated : 15 Oct 2022 11:27 IST

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మాన్‌స్టర్‌’ (Monster). ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 21న సినిమాని విడుదల చేస్తున్నట్లు కొత్తపోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంటూ వెల్లడించారు మోహన్‌లాల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.ఈ సినిమాలో మోహన్‌లాల్‌.. లక్కీసింగ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. ఓ కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో పోలీసులు.. లక్కీసింగ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. వైశాఖ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, హనీ రోజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని