God Father: ‘లూసిఫర్‌’ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ చాలా బాగుంది: మోహన్‌

చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌పై చిత్ర దర్శకుడు మోహన్‌రాజా తండ్రి, ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ స్పందించారు. సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు.

Published : 09 Oct 2022 01:40 IST

హైదరాబాద్‌: చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌పై చిత్ర దర్శకుడు మోహన్‌రాజా తండ్రి, ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ స్పందించారు. ‘లూసిఫర్‌’ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ చాలా బాగుందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘లూసిఫర్‌’ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ చాలా బాగుంది. గాడ్‌ఫాదర్‌ పాత్రే కింగ్‌లా ఉంటుంది. చిత్రబృందం మొత్తం దీన్ని అద్భుతంగా తెరకెక్కించింది. ‘లూసిఫర్‌’ మహిళలకు నచ్చుతుందో లేదోననే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ, ‘గాడ్‌ఫాదర్‌’ మహిళలకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ దీన్ని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేను పనిచేసిన ఏ చిత్రమైనా విడుదలైతే.. థియేటర్‌కు వెళ్లి ఏదో ఒక మూల నిల్చొని ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూసేవాడిని. కానీ, ఈ సినిమాని ప్రేక్షకులందరితో కలిసి థియేటర్‌లో కూర్చొని చూశా. సినిమా జరిగినంతసేపు ప్రేక్షకులెవరూ పక్కన వారితో కూడా మాట్లాడలేదు. సినిమాలో అంతలా లీనమైపోయారు. అది చూసి ఆశ్చర్యపోయాను. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్‌, బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ చూస్తుంటే.. చిరంజీవి గారు ఎప్పటికీ బాక్సాఫీస్‌ ఘరానామొగుడే. ఆయన ఎప్పటికీ కింగే’’ అని ఆయన పేర్కొన్నారు.

అనంతరం తన చిన్నకుమారుడు ‘జయం’ రవిని తెలుగులోకి పరిచయం చేయనందుకు బాధగా ఉందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన్ని తెలుగు సినిమాకు పరిచయం చేస్తానని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని