డబ్బులు సంపాదించాలంటే ఇవి తప్పుకాదు..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది....

Published : 05 Feb 2021 12:45 IST

హైదరాబాద్‌: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది.

‘డబ్బులు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్‌ వద్దు కన్నా..! స్కిమే అయినా స్క్యామే అయినా రెండు ఒకటే తప్పలేదురా అన్నా’ అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియో ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రుహీ సింగ్‌, నవ్‌దీప్‌, నవీన్‌చంద్రా తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి

టాలీవుడ్‌లో బీటౌన్‌ లేడీస్‌ ‘కీ’ రోల్‌

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసు ప్రసాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని