పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!

‘డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అని అంటున్నారు...

Updated : 25 Feb 2021 17:28 IST

ఆసక్తిగా ‘మోసగాళ్లు’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా.. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అని అంటున్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడుగా జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మోసగాళ్లు’. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. వాస్తవికతతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.  ‘ప్రతి వాడికి సిటీ మొత్తం కనిపించే ఎత్తులో ఉండాలనేదే కోరిక. మనం పైనున్నప్పుడు ఏం చేస్తామో.. దాన్ని బట్టి మనం ఎంతకాలం పైనుంటామో డిసైడ్‌ అవుతుంది’, ‘డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేం కాదు’ అనే డైలాగులు అలరిస్తున్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోందీ ప్రచార చిత్రం‌. మరి ఈ మోసగాళ్ల కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఈ సినిమాని వాస్తవ సంఘటనల ఆధారంగా ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్‌ కనిపించనుంది. నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహీసింగ్‌, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని