Pawan Kalyan28: పవన్‌-హరీశ్‌ శంకర్‌ మూవీ.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

Pawan Kalyan: పవన్‌-హరీశ్‌ శంకర్‌ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త

Published : 06 Sep 2021 16:55 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది పవన్‌ నటిస్తున్న 28వ సినిమా కావటం విశేషం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. త్వరలోనే పవన్‌ 28వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా హరీశ్‌ శంకర్‌, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌లు పవన్‌ను కలిశారు. సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌, ఇతర వివరాలను ఆయనకు తెలియజేశారు. హరీశ్‌ శంకర్‌ టీమ్‌ వర్క్‌పై పవన్‌ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. వీలైనంత త్వరగా ‘భీమ్లా నాయక్‌’ పూర్తి చేసి, ‘హరిహర వీరమల్లు’తో పాటు హరీశ్‌ శంకర్‌ సినిమా కోసం డేట్స్‌ కేటాయించాలని పవన్‌ చూస్తున్నారు. అయాంక్‌ బోస్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని