Most Eligible Bachelor: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో మంచి సీన్‌ కట్ చేసేశారే..!

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. నిడివి ఎక్కుకకావడంతో చిత్ర బృందం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించింది. వాటిల్లోని ఓ సీన్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది.

Published : 24 Oct 2021 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. నిడివి ఎక్కుకకావడంతో చిత్ర బృందం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించింది. వాటిల్లోని ఓ సీన్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా విడుదల చేసింది. ‘పెళ్లి చూపులు’ నేపథ్యంలో సాగుతుందీ సన్నివేశం. ‘యు.ఎస్‌ బ్యాచ్‌ చేతులెత్తండి.. భీమవరం బ్యాచ్‌ చేతులెత్తండి’ అంటూ సుడిగాలి సుధీర్‌ ఇందులో సందడి చేశారు. మరోవైపు, పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన అమ్మాయితో అఖిల్‌ వినోదం పంచాడు. ఆ అమ్మాయి, ఆమె పనిమనిషిని ఉద్దేశించి అఖిల్‌ చెప్పిన మాటలు సరదాగా సాగాయి. ఈ సీన్‌లో అఖిల్‌ హావభావాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే ‘అరే.. మంచి సీన్‌ కట్‌ చేశారే’ అనిపించకమానదు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని