Round up 2022: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన సినిమాలివే.. టాప్‌లో ‘బ్రహ్మాస్త్ర’
ఈ ఏడాది ఎక్కువగా వెతికిన సినిమాల జాబితాలను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో ‘బ్రహ్మాస్త్ర’ మొదటిస్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) విడుదల చేసిన జాబితాలో ‘బ్రహ్మాస్త్ర’ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2022 తుది దశకు చేరుకోవడంతో.. ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా వెతికిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. టాప్ 10 చిత్రాలతో కూడిన ఈ జాబితాలో ‘బ్రహ్మాస్త్ర’ మొదటిస్థానాన్ని సొంతం చేసుకోగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. మరి, ‘కాంతార’, ‘విక్రమ్’, ‘కేజీయఫ్’ ఏయే స్థానాల్లో ఉన్నాయంటే..
ఎక్కువగా వెతికిన భారతీయ చిత్రాలు:
1.బ్రహ్మాస్త్ర
2.కేజీయఫ్ -2
3.ది కశ్మీర్ ఫైల్స్
4.ఆర్‌ఆర్‌ఆర్
5.కాంతార
6.పుష్ప : ది రైజ్
7.విక్రమ్
8.లాల్ సింగ్ చడ్డా
9.దృశ్యం 2
10.థార్ - లవ్ అండ్ థండర్
ప్రపంచవ్యాప్తంగా వెతికిన చిత్రాలు:
1.థార్ - లవ్ అండ్ థండర్
2.బ్లాక్ ఆడమ్
3.టాప్ గన్
4.ది బ్యాట్‌మ్యాన్
5.ఎన్కాంటో
6.బ్రహ్మాస్త్ర
7.జురాసిక్ వరల్డ్
8.కేజీయఫ్-2
9.అన్‌చార్టడ్
10.మోర్బియస్
అలియాభట్ - రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ రెండు జాబితాల్లోనూ స్థానాన్ని దక్కించుకుంది. దీనిపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. సినీ ప్రియులకు ధన్యవాదాలు చెబుతూ టీమ్ పోస్టులు పెట్టింది. ఇక, భారతీయ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూడు భాగాల్లో ప్రేక్షకులను అలరించనుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర - శివ’ పేరుతో విడుదలై మంచి టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు వీఎఫ్‌ఎక్స్ సరిగ్గా లేవంటూ పలువురు నెటిజన్లు విమర్శలు కురిపించారు. మరోవైపు, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాలూ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. కన్నడ చిత్రంగా విడుదలైన ‘కాంతార’ పాన్ ఇండియా స్థాయిలో విశేష గుర్తింపు సొంతం చేసుకుంది.
దక్షిణాది @ 10 చిత్రాలు
1.కేజీయఫ్-2
2.ఆర్‌ఆర్‌ఆర్
3.కాంతార
4.పుష్ప-ది రైజ్
5.విక్రమ్
6.లైగర్
7.కార్తికేయ -2
8.రాధేశ్యామ్
9.సీతారామం
10.పొన్నియిన్ సెల్వన్ -1
తెలుగు చిత్రాలు:
1.ఆర్‌ఆర్‌ఆర్
2.పుష్ప - ది రైజ్
3.లైగర్
4.కార్తికేయ-2
5.రాధేశ్యామ్
6.సీతారామం
7.సర్కారువారిపాట
8.మేజర్
9.ఆదిపురుష్
10.శ్యామ్‌సింగరాయ్
తమిళ చిత్రాలు:
1.విక్రమ్
2.పొన్నియిన్ సెల్వన్
3.బీస్ట్
4.రాకెట్రీ
5.లవ్ టుడే
6.వలిమై
7.తిరుచిత్రబలం
8.మహాన్
9.కోబ్రా
10.విరుమన్
కన్నడ చిత్రాలు:
1.కేజీయఫ్-2
2.కాంతార
3.విక్రమ్ వేద
4.777 ఛార్లి
5.కేజీయఫ్ -1
మలయాళీ చిత్రాలు:
1.హృదయం
2.భీష్మ పర్వం
3.జన గణ మన
4.మిన్నల్ మురళి
5.కడువా
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
-
India News
US Visa: వీసా రెన్యువల్‌కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’