Amazon Prime - Shersaah: 210 దేశాలు.. 4,100 ప్రాంతాల్లో ఆ సినిమా చూశారట

అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయిన ‘షేర్‌షా’ను అమెజాన్‌ ప్రైమ్‌లో ఎక్కువ మంది వీక్షించినట్లు మంగళవారం అమెజాన్‌ ప్రకటించింది. 

Updated : 01 Sep 2021 04:09 IST

ముంబయి: సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా.. కార్గిల్‌ యుద్ధ వీరుడు లెఫ్టినెంట్‌ విక్రమ్‌ బాత్రా జీవితాధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘షేర్షా’. ఆగస్టు 12 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఈ సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో ఎక్కువ మంది వీక్షించినట్లు మంగళవారం అమెజాన్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా  210 దేశాలతో పాటు.. దేశంలోని 4100 నగరాలు, గ్రామాల్లోని ప్రజలు దీన్ని చూశారట. అంతేకాదు.. ఐఎండీబీ 8.9 రేటింగ్‌ ఇవ్వగా... 88 వేల మంది ఐఎండీబీ యూజర్లు అత్యంత గుర్తింపు పొందిన చిత్రంగా ఓటు వేసినట్లు ధర్మా ప్రొడక్షన్స్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా..‘‘షేర్షా’ చిత్రానికి మీరందరూ కురిపిస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా గుర్తింపు తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా ధన్యావాదాలు’’ అన్నారు. డింపుల్‌గా నటించిన కియారా అభిమానులకు థాంక్స్‌ చెప్పారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి లభిస్తున్న ఆదరణతో అగ్రహీరోలు సైతం అటువైపు అడుగులేసేందుకు ముందుకొస్తున్నారు. నటులు అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, షాహిద్‌ కపూర్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపారు



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని