Karate Kalyani: కరాటే కల్యాణికి ‘మా’ నోటీసులు

నటి కరాటే కల్యాణికి ‘మా’ నోటీసులు జారీ చేసింది.

Updated : 17 May 2023 13:26 IST

హైదరాబాద్‌: నందమూరి తారకరామారావు (NTR)పై నటి కరాటే కల్యాణి (Karate Kalyani) చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (MAA) సీరియస్‌గా తీసుకుంది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘణ కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సదరు వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని