Chalapathi Rao: తెలుగు చిత్రసీమ ఓ మంచి నటుణ్ని కోల్పోయింది

చలపతిరావు హఠాన్మరణం తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. ఆయనికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Updated : 26 Dec 2022 06:50 IST

చలపతిరావు (Chalapathi Rao) హఠాన్మరణం తెలుగు చిత్రసీమలో (Tollywood) విషాదాన్ని నింపింది. ఆయనికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

* ‘‘ఈ డిసెంబరు తీరని వేదన కలిగించింది. విలక్షణమైన నటుడు, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. మద్రాసులో ఉన్నప్పటి నుంచే మాకు అనుబంధం ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో నేను కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’.

చిరంజీవి

* ‘‘చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా మంచి చిత్రాల్ని నిర్మించారు. మా కుటుంబంతో ఆయనకు ఆత్మీయ బంధం ఉంది. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’.

నందమూరి బాలకృష్ణ

* ‘‘చలపతిరావు లాంటి మంచివ్యక్తి మరణం సినిమా పరిశ్రమకే కాదు.. నాకూ తీరని లోటు. తను సెట్లో ఉంటే కోలాహలంగా ఉంటుంది. ఆయన మంచి మనసున్న అజాత శత్రువు’’.

మోహన్‌బాబు

* ‘‘ప్రముఖ నటుడు చలపతిరావు మృతి చెందడం బాధాకరం. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్‌ నటులు ఒక్కొక్కరుగా ఇలా కాలం చేయడం దురదృష్టకరం’’.

పవన్‌కల్యాణ్‌

* ‘‘పాత్ర ఏదైనా సరే చలపతిరావు అందులో ఒదిగిపోయేవారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు’’.

ఎస్వీ కృష్ణారెడ్డి

* ‘‘చలపతిరావు ఎంతో మంచి వ్యక్తి. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉండేవారు. జోకులు వేస్తూ అందర్నీ నవ్వించేవారు’’.

దగ్గుబాటి సురేశ్‌ బాబు

* ‘‘చలపతిరావు హఠాన్మరణం బాధించింది. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రతిఒక్కరితో స్నేహంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజున మన మధ్య లేరంటే చాలా బాధగా ఉంది. నా కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను’’.

వెంకటేష్‌

* ‘చలపతిరావు మరణంతో నందమూరి కుటుంబం ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయింది’’ అంటూ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు ఎన్టీఆర్‌. అమెరికాలో ఉన్న ఆయన రవిబాబుని వీడియోకాల్‌ ద్వారా పరామర్శించి చలపతిరావు భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని