Alluri Sitarama Raju: వెండితెరపై వెలిగిన మన్యం వీరులు వీరే..
ధైర్యం, త్యాగానికి మారుపేరైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) జీవితగాథ తెలుగువారికి సుపరిచితమే. అలాంటి స్వాతంత్ర్య యోధుడి పాత్రలో నటించేందుకు ఎంతోమంది తెలుగు హీరోలు ఆసక్తి కనబర్చినప్పటి....
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) జీవిత గాథ తెలుగువారికి సుపరిచితమే. అలాంటి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించేందుకు ఎంతోమంది తెలుగు హీరోలు ఆసక్తి కనబర్చినప్పటికీ కేవలం కొందరికి మాత్రమే ఆ అదృష్టం వరించింది. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna). కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే అనే పేరు ప్రేక్షకుడి మదిలో సుస్థిరంగా నిలిచిపోయింది. సోమవారం ‘అల్లూరి సీతారామరాజు’ 125వ జయంతి సందర్భంగా ఆ పోరాటయోధుడి పాత్రలో నటించిన తెలుగు నటులెవరో తెలుసుకుందాం..!
అల్లూరి పాత్రలో నటించాలని ఎంతగానో ఆశపడ్డ నటుల్లో అగ్రకథానాయకుడు నందమూరి తారకరామారావు(NTR) ఒకరు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సీతారామరాజు పాత్ర చేయడం ఆయనకు సాధ్యపడలేదు. ఓ సమయంలో ఆనాటి ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారుచేయించారు. అది పట్టాలెక్కడం కాస్త ఆలస్యమైంది. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ తెరకెక్కించారు. అయితే.. అల్లూరిపై ఉన్న మక్కువతో మరో సినిమా చేయాలని ఉద్దేశంతో ఓసారి పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి కథ సిద్ధం చేయమని కోరగా, ‘కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చూడండి అన్నగారు.. అప్పటికీ మీకు సినిమా చేయాలనిపిస్తే తప్పకుండా కథ రాస్తాం’ అని చెప్పడంతో ప్రత్యేకంగా షో వేయించుకుని సినిమా చూసి, కృష్ణను అభినందించారు. ఇక తాను సీతారామరాజు సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే, సీతారామరాజు పాత్రలో నటించాలనే తన చిరకాల కోరికను ‘సర్దార్ పాపారాయుడు’(Sardar Papa Rayudu), ‘మేజర్ చంద్రకాంత్’ (Major Chandrakanth) చిత్రాలతో తీర్చుకున్నారు. ఆయా చిత్రాల్లోని పాటల్లో ఎన్టీఆర్ ‘అల్లూరి’ గెటప్‌లో దర్శనమిస్తారు.
‘‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడూ ఒక్కో విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు. సమూహ శక్తి’’ అంటూ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో ఒదిగిపోయి నటించారు సూపర్‌స్టార్ కృష్ణ. అల్లూరి కథను ఎలాగైనా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాలనే కృష్ణ సంకల్పమే ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే, ఈ చిత్రానికి ముగ్గురు వ్యక్తులు దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్‌ని వి.రామచంద్రరావు డైరెక్ట్ చేయడం ప్రారంభించి.. కొంతభాగం షూట్ చేసిన తర్వాత ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కృష్ణ మెగాఫోన్ పట్టారు. ఇక, ఇందులోని పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు. 1974 మే 1 విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. సుమారు 19 థియేటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకొంది.
బాలకృష్ణ (Balakrishna) కూడా అల్లూరిగా నటించాలని ఆశపడ్డారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ‘భారతంలో బాలచంద్రుడు’లోని(Bharatamlo Bala Chandrudu) ఓ సీన్లో సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఇక, ఇటీవల విడుదలైన ‘ఎన్టీఆర్’ (NTR) బయోపిక్ కోసం మరోసారి అల్లూరి గెటప్ ధరించారు.
రామ్‌చరణ్(RamCharan) ఇటీవల అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టేశారు. కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్ కథతో అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’లో(RRR) సీతారామరాజుగా ఆయన నటించి సినీ ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్‌లో ఆయన అల్లూరిగా బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తుంటే.. ఆ సన్నివేశాలు చూసి ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!